నిద్ర లేవగానే ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. చాలామంది రాత్రి క్రీమ్ రాసుకుని నిద్రపోతారు. దాన్ని తొలగించడానికి క్లెన్సర్ లేదా ఫేస్ వాష్‌తో ముఖాన్ని బాగా కడగాలి. సమయం ఉంటే.. చర్మాన్ని శుభ్రం చేసిన తర్వాత సీరం ఉపయోగించవచ్చు. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. డ్రై స్కిన్ ఉంటే.. వముఖం శుభ్రం చేసిన తర్వాత క్రీమ్ లేదా మాయిశ్చరైజర్ ఉపయోగిం చకుండా ఫేస్ సీరం ఉపయోగిస్తే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అలాగే ఆయిలీ స్కిన్ ఉంటే.. మొదట క్లెన్సర్ లేదా ఫేస్ వాష్‌తో ముఖం కడుక్కోండి. ఆ తర్వాత ఫేస్ టోనర్ ఉపయోగిస్తే మంచిది.
ముఖానికి క్లెన్సర్ లేదా ఫేస్ వాష్ ఉపయోగిస్తారు కాబట్టి.. దాని తర్వాత తేలికపాటి క్రీమ్ లేదా మాయిశ్చరైజర్ ఉపయోగించడం అవసరం. లేకపోతే చర్మం పొడిబారిపోతుంది.
అలాగే టోనర్‌తో కూడా ముఖాన్ని క్లీన్ చేసుకోవచ్చు. ఆ సమయంలో దూది ఉపయోగించాలి. దీనివల్ల మురికి ఈజీగా తొలగిపోతుంది. చర్మం తేమగా ఉంటుంది. దీనివల్ల చర్మం పొడిబారే ప్రమాదం ఉండదు.
ఉదయం ముఖం శుభ్రం చేసిన తర్వాత.. ఎండ ఉన్నా లేకున్నా.. బయటకు వెళ్లినా వెళ్లకున్నా.. సన్‌స్క్రీన్ కచ్చితంగా ఉపయోగించాలి. ఎందుకంటే ఇంటి నుంచి బయటకు వెళ్లినా లేకపోయినా అధిక ఉష్ణోగ్రత చర్మంపై ప్రభావం చూపిస్తుంది. ఆ సమయంలో సన్‌స్క్రీన్ ఒక సంరక్షణగా పని చేస్తుంది.
జిడ్డుగల చర్మం ఉన్నవారు జెల్ లేదా వాటర్ బేస్డ్ సన్‌స్క్రీన్ ఉపయోగిస్తే మంచిది. ఒకసారి సన్‌స్క్రీన్ రాసుకుని రోజంతా ఉంచు కోకుండా.. చెమటలు పడితే ముఖం కడిగి.. మళ్ళీ సన్‌స్క్రీన్ రాసుకోవాలి.
వృద్ధాప్యఛాయలను దూరం చేయడంలో సన్‌స్క్రీన్ మంచి ఫలితాలు ఇస్తుందని గుర్తించుకోవాలి.
స్కిన్ హెల్త్ కోసం..
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)