- ఏడుగురు పట్టివేత..
- నాలుగు ఇసుక ట్రాక్టర్లు సీజ్
- ఎస్హెచ్ఓ సాయి కిశోర్ రెడ్డి
నవతెలంగాణ – అశ్వారావుపేట
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఏడుగురిని పోలీసులు పట్టుకొని, ట్రాక్టర్లు, ఇంజన్ను స్వాధీనం చేసుకున్నారు. అశ్వారావుపేట ఎస్ఐ బి. సాయి కిశోర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మండలంలోని గాడ్లగూడెం గ్రామ శివారులో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు వాగు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఇసుక లోడుతో ఉన్న నాలుగు ట్రాక్టర్లు, రెండు ఖాళీ ట్రాక్టర్లు, ఒక ట్రాక్టర్ ఇంజన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్హెచ్ఓ సాయి కిశోర్ రెడ్డి తెలిపారు.






కామెంట్లు (0)