Magazines

టెస్టుల్లో జింబాబ్వే అరుదైన రికార్డు

12 గంటల క్రితం

Zimbabwe's rare record in Tests
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్ : టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో జింబాబ్వే జట్టు అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే టెస్ట్‌ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 500కు పైగా పరుగులు చేసిన తొలి జట్టుగా నిలిచింది. షార్జా వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో ఈ ఘనత సాధించినట్లు ఐసీసీ వెల్లడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 504 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఐదో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 523 పరుగులు సాధించింది. కెప్టెన్‌ క్రెయిగ్‌ ఎర్విన్‌ (206 నాటౌట్‌), వెస్లీ మధెవెరే (100 నాటౌట్‌) అజేయంగా నిలిచారు. సమయం ముగియడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. 41 ఏళ్ల 82 రోజుల వయసులో డబుల్‌ సెంచరీ చేసిన ఎర్విన్‌.. టెస్టుల్లో ఈ ఘనత సాధించిన మూడో అత్యంత పెద్ద వయస్కుడిగా మరో రికార్డు నెలకొల్పాడు. రెండో టెస్టు ఈ నెల 13న ఇదే వేదికగా ప్రారంభం కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్