నవతెలంగాణ-కుభీర్
మండలంలోని డోడర్నా తండా 3 కు చెందిన చవాన్ లక్కబాయి, డోడర్నా తండా 4 గ్రామానికి చెందిన జాదవ్ నాగిబాయిలు ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ముధోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ మనవయ్య సమితి సభ్యుడు కిరణ్ కొమ్రే వారు బాధిత కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించి, మృతికి గల కారణాలు అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధైర్య పడొద్దనీ, బిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. వారి వెంట బిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఎన్నిల అనిల్, దొంతుల దత్తాత్రి, రావుల పోశెట్టి, సజ్జన్, ప్రదీఫ్, మహేష్ తదితరులు ఉన్నారు.
బాదిత కుటుంబాలకు పరామర్శ
52 నిమిషాల క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)