నవతెలంగాణ - అశ్వారావుపేట
అశ్వారావుపేటలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 10, 11, 12 తేదీల్లో నిర్వహించనున్న పోటీలకు సంబంధించి క్రీడా మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదివారం పరిశీలించారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మైదానాన్ని సిద్ధం చేయాలని నిర్వాహకులకు సూచించారు. క్రీడాకారులు, ప్రేక్షకుల కోసం తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, భద్రత, ఇతర మౌలిక సదుపాయాలు సమకూర్చాలని తెలిపారు. పోటీల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాటైన కమిటీలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కోరారు. పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరుకానున్న నేపథ్యంలో వారికి అవసరమైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
ఆయన వెంట మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు, నాయకులు తాడేపల్లి రవి తదితరులు పాల్గొన్నారు






కామెంట్‌లు (0)