:నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్రం కరువుతో అల్లాడుతోందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తక్షణమే కరువు మండలాలను ప్రకటించాలంటూ ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు 20 అడుగులు పడిపోయాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుణ యాగం చేసినా.. వర్షాలు పడక పోవడంతో ఆయన చేతులెత్తేశారని వ్యంగ్యంగా అన్నారు. ఆదివారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో 6 గంటలకు మించి విద్యుత్ ఇవ్వడం లేదని రేవంత్ సర్కార్‌పై మండిపడ్డారు.
''అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లోనూ పేపర్ బ్యాలెట్ ద్వానే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈవీఎం లను మ్యానిఫులేట్ చేసే అవకాశం ఉందని అభివృద్ధి చెందిన దేశాలు భావిస్తున్నాయి. మళ్లీ దేశంలో పేపర్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిగేందుకు మా పార్టీ తరఫున దిల్లీ వరకు వెళ్లి పోరాటం చేస్తాం. ఖైరతాబాద్ ఉప ఎన్నిక కు ఇంకా సమయం పట్టవచ్చని భావిస్తున్నాం. ఖైరతాబాద్ సహా రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చిన సరే మేము పోటీ చేస్తాం. ఎన్నికలు అనేవి మా పార్టీ అజెండా చెప్పుకునేందుకు ఓ అవకాశంగా భావిస్తాం. అదే విధంగా భవిష్యత్ లో స్కూళ్లలో బాత్ రూమ్ లు, కనీస సౌకర్యాలు ఉన్నాయో లేదా అన్న దానిపై కూడా పరిశీలనకు పార్టీ బృందాన్ని నియమిస్తాం..`` అని కవిత తెలిపారు.






కామెంట్‌లు (0)