Magazines

బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు దద్దమ్మలు: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

1 గంట క్రితం

Mahesh Kumar Goud
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అన్ని అన్ని వర్గాల పార్టీ అని.. కాంగ్రెస్ పార్టీ లో ఎవరికి దక్కాలో వారికి దక్కుతుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు దద్దమ్మలని ఎద్దేవా చేశారు. ఆదివారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకరయ్య ఆధ్వర్యంలో ఓబీసీ కులగణనపై భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.


బీజేపీ తూతూ మంత్రంగా సర్వే చేస్తున్నారని... మోదీ కి కనువిప్పు కలగాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పిలుపు కేంద్రానికి తెలియాలని అన్నారు. దేశ వ్యాప్తంగా సర్వే రానున్న రోజుల్లో మేమే చేసుకుంటామని.. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని.. అన్ని వర్గాలకు రావలసిన వాట రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇస్తామని మహేష్ కుమార్ గౌడ్ దీమా వ్యక్తం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్