Magazines

ఎల్‌నినో ప్రభావంలోనూ వాన

56 నిమిషాల క్రితం

RAIN
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

- శనివారం అశ్వారావుపేటలో వర్షం

- మిగతా మండలాల్లో కురవని వర్షం 

నవతెలంగాణ - అశ్వారావుపేట

ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు కొనసాగుతున్నప్పటికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం అశ్వారావుపేట మండలంలో వర్షం కురిసింది. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం అశ్వారావుపేటలో 28.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా 22 మండలాల్లో వర్షం నమోదు కాలేదు.

జిల్లాలో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 997.8 మిల్లీమీటర్లు కాగా, 765 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. దీంతో 23.3 శాతం లోటు నెలకొంది. మొత్తం 23 మండలాల్లో ఎనిమిది మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా, 15 మండలాల్లో లోటు కొనసాగుతోంది.

అశ్వారావుపేటలో ఇప్పటివరకు 635.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 893.9 మిల్లీమీటర్లు కావాల్సి ఉండగా, 28.9 శాతం లోటు ఉంది. శనివారం కురిసిన వర్షం పంటలకు కొంత ఊరటనిచ్చినా, మండలంలో నెలకొన్న వర్షపాతం లోటు మాత్రం కొనసాగుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్