పత్తి షెడ్డర్ యంత్రం వినియోగంపై రైతులకు అవగాహన
నవతెలంగాణ-మిడ్జిల్
నీటి ఎద్దడిని తట్టుకునే పంటలను రైతులు ఎంపిక చేసుకోవాలని శాస్త్రవేత్త డాక్టర్ కళ్యాణి రైతులకు సూచించారు. బుధవారం మండలంలోని కొత్తూరు గ్రామంలో నీ రైతు వేదికలో కొత్తూరు, వెలుగొమ్ముల, బోయిన్పల్లి, అయ్యవారిపల్లి గ్రామాల చెందిన రైతులకు పత్తి షెడ్డర్ యంత్రం వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త కళ్యాణి మాట్లాడుతూ..మండలంలో ప్రస్తుత వానాకాలం 2026లో సుమారు 15,000 ఎకరాలకు పైగా పత్తి సాగు చేయడం జరిగింది. పత్తి పంట కోత అనంతరం పత్తి కర్రలను కాల్చడం వల్ల నేలలోని ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు నశించడంతో పాటు, నేలలో సేంద్రియ పదార్థం మరియు సారం తగ్గి, వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని రైతులకు వివరించినట్లు పేర్కొన్నారు.
పత్తి షెడ్డర్ యంత్రాన్ని వినియోగించి పత్తి కర్రలను చిన్న చిన్న ముక్కలుగా చేసి పొలంలోనే వేయాలని, అనంతరం రోటవేటర్తో నేలలో కలియదున్నడం ద్వారా సేంద్రియ పదార్థం పెరిగి, నేల ఆరోగ్యం మరియు పోషక విలువలు మెరుగుపడే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన DHM-182 మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాలను పరిశీలనా క్షేత్రం ఓ ఎఫ్ టి నిర్వహణలో భాగంగా రైతులకు అందజేశారు. ఈ హైబ్రిడ్ విత్తనం ఎకరానికి 32–35 క్వింటాళ్ల దిగుబడినిచ్చే సామర్థ్యంతో పాటు ఎండు తెగులును తట్టుకునే లక్షణం కలిగి ఉందని చెప్పారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో నీటి ఎద్దడిని తట్టుకునే పంటల ఎంపిక, పంటలను కాపాడుకునే పద్ధతులు మరియు అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా నియోగించుకోవాలని చేసించారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు, వెల్గంలా, మల్లాపూర్ గ్రామాల రైతులు, దుందుభి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పి. వెంకటయ్య , డైరెక్టర్ మంజుల భద్రయ్య, కృష్ణారెడ్డి , దశరథం మీ రాజి బాలస్వామి జంగయ్య నాగ మైసయ్య ,శ్రీను వివిధ గ్రామాలకు చెందిన రైతులు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)