Magazines

గణపతి హోమంలో పాల్గొన్న బీర్ల దంపతులు

23 సెప్టెంబర్, 2026

ganesh homam
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌన్ 
ఆలేరు పట్టణంలోని శ్రీహిత్ మీసేవ దగ్గరలోని వినాయక మండపం వద్ద దుర్గ భవాని అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం లక్ష్మి గణపతి హోమం, అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత    సంయుక్తంగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో  ఉండేలా చూడాలని గణనాధుని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం వినాయక నిర్వాహకులు బీర్ల దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలేరు చైర్మన్ బీజన బాలమణి భాస్కర్, వెంకటేశ్వర రాజు, నీలం పద్మ, దుర్గా భవాని అసోసియేషన్ బాధ్యులు చిక్క శ్రావణ్ కుమార్, ప్రకాష్ రెడ్డి,మంత్రి రమేష్, గణేష్,చాడ భాస్కర్ రెడ్డి,పుప్పాల సత్తయ్య, కస్తూరి నాగరాజు,తోట ప్రశాంత్, కొంతం వెంకటరెడ్డి, మైల శ్రీశైలం, మాలోతు శ్రీను నాయక్,రాజేందర్ రెడ్డి, చింతకింది శంకర్,పద్మ కృష్ణ ,మామిడాల శివ కృష్ణ, మంగ మనోజ్, విశ్వ నాథ్, పుట్ట కిరణ్, దుర్గా భవాని అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్