Magazines

తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందో?

1 గంట క్రితం

Congress
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 3 నిమిషాల చదవడం

మార్కెట్ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు..

తుంగతుర్తి మార్కెట్ కమిటీ ఎస్సీలకు రిజర్వేషన్ ఖరారు..

ఎమ్మెల్యే మంత్రుల చుట్టూ ఆశావాహుల ప్రదక్షిణలు....

నవతెలంగాణ-తుంగతుర్తి
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రోటోకాల్ విషయంలో ఎమ్మెల్యే తర్వాత అంతటి ప్రాధాన్యత గల పోస్టు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి.అక్టోబర్ 5న చైర్మన్ పదవీ కాలం ముగిసింది.ఈక్రమంలో నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లను ప్రకటించింది.తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఎస్సీలకు కేటాయించడం జరిగింది.


దీంతో పాలకవర్గాలకు సారథ్యం వహించే చైర్మన్ పదవి కోసం అధికార పార్టీలో పోటీ నెలకొన్నది.ప్రధానంగా నలుగురు నేతలు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.వీరు ఎలాగైనా చైర్మన్ పదవి దక్కించుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే,మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.పదవిని దక్కించుకునేందుకు ఎవరికి వారు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.దీంతో మండలాల్లోని ప్రజలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందోననీ జోరుగా చర్చించుకుంటున్నారు.

పోలేపాక రామచంద్రు

తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తనకే దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు,రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ ప్రియ శిష్యుడు పోలేపాక రామచంద్రు ధీమా వ్యక్తం చేశారు.తుంగతుర్తి మండల పరిధిలోని తూర్పుగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలేపాక రామచంద్రు.మండలంలోని 24 గ్రామ పంచాయతీలలో తూర్పుగూడెం గ్రామపంచాయతీని ఏకగ్రీవ సర్పంచిగా చేయడంలో రామచంద్రు పాత్ర కీలకం.ఎమ్మెల్యేకు నమ్మినబంటుగా ఉంటూ,నియోజకవర్గంలోని ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్నారు,ఇటీవల గాంధీభవన్లో సైతం మందుల సామేలు చేసిన అభివృద్ధిపై తన వానిని వినిపించారు.గత 20 సంవత్సరాలకు పైగా పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతూ ఎలాంటి పదవి ఆశించకుండా,పార్టీ ఆదేశానుసారం ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం,ఎమ్మెల్యే సహాయ సహకారాలు ఉండడం చేత చైర్మన్ పదవి లభిస్తుందని తెలిపారు.

చింతకుంట్ల వెంకన్న

తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తనకే వస్తుందని ప్రస్తుత మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న ఆశాభావం వ్యక్తం చేశారు.తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామానికి చెందిన చింతకుంట్ల వెంకన్న 2009 లోనే గ్రామశాఖ ఉపాధ్యక్షులుగా,2011 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ఏర్పాటుకు కృషి చేశారు.2013 లో గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కృషి చేశారు,2018 లో మండల వర్కింగ్ ప్రెసిడెంట్గా,2023 లో మండల ఉపాధ్యక్షులుగా,2024 అక్టోబర్ నుండి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా సేవలందిస్తున్నారు.కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారు. పార్టీ ఆదేశానుసారం ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం,ఎమ్మెల్యే సహకారంతో చైర్మన్ పదవి తనకే లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

పాల్వాయి నాగరాజు కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ నియోజకవర్గ అధ్యక్షులు

మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తనకే దక్కుతుందని నూతనకల్ మండల పరిధిలోని వెంకేపల్లి గ్రామానికి చెందిన,ఎమ్మెల్యే మందుల సామేలు ప్రియ శిష్యుడు పాల్వాయి నాగరాజు ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో ఎమ్మెల్యే సామేలు వెంట తిరిగి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. 2012లో జరిగిన సకల జనుల సమ్మెలో నూతనకల్ మండలం నుండి పెద్దన్న పాత్ర చేపట్టారు.మందుల సామేలు గిడ్డంగుల చైర్మన్ గా పనిచేసిన సమయంలో సైతం ఎల్లప్పుడూ తన వెంట ఉన్నారు.పార్టీ ఆదేశానుసారం ఎల్లప్పుడూ పార్టీ కార్యక్రమాలు చేపడుతూ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు.


ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ నియోజకవర్గ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా ఎల్లప్పుడూ పార్టీ ఆదేశానుసారం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే సామెల్ ఆశీస్సులు,పార్టీ అధిష్టానం నుండి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించానని యువ నాయకుడిగా తనకే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తనకే వస్తుందని తెలిపారు.

 కొమ్ము అంజయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చందుపట్ల

తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి తానే అన్ని విధాల అర్హత గల వ్యక్తిని మద్దిరాల మండల పరిధిలోని చందుపట్ల గ్రామానికి చెందిన కొమ్ము అంజయ్య అన్నారు.1997 నుండి పార్టీలో కొనసాగుతూ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశానని తెలిపారు. 1999లో ఉమ్మడి జిల్లా ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శిగా పనిచేశానని తెలిపారు. తుంగతుర్తి మార్కెట్ ఏర్పడిన నాటినుండి మొదటిసారి తుంగతుర్తి మండలానికి,తర్వాత రెండుసార్లు నూతనకల్ మండలానికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి వరించిందని ఇప్పుడు మద్దిరాల మండలానికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కేటాయించాలని అన్నారు.


గతంలో మండల పార్టీ అధ్యక్షుడి పదవి ఆశించి భంగపడ్డానని ఇప్పుడు ఎమ్మెల్యే మందుల సామేలు ఆశీస్సులతో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తనకే లభిస్తుందని తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం పోటీ తీవ్రంగా మారింది.ప్రధానంగా నలుగురు ముఖ్య నేతల మధ్యే ఈసారి గట్టి పోటీ నెలకొన్నట్లు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.పోటీలో ఉన్న నలుగురు నేతల్లో ఎమ్మెల్యే ఎవరు వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిందే..

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్