నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో బారడి పోచమ్మ ఆలయం సమీపంలో బోరు మోటర్ ను శనివారం సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎండాకాలం రాకముందే నీటి కొరత నివారణకై గ్రామంలో ముందస్తు చర్యలు చేపట్టామని అన్నారు. గ్రామస్తులు నీటి కోసం ఇబ్బందులు పడొద్దని ఈ కార్యక్రమానికి పూనుకున్నామని పేర్కొన్నారు. సర్పంచ్ ముందుచూపు పనులతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరస్ సాయిలు, తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)