నవతెలంగాణ-మల్హర్ రావు
మంథని నియోజకవర్గం మల్హర్ మండల అభివృద్ధికి రూ.2.82 కోట్ల నిధులను రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు మంజూరు చేశారు.గ్రామ పంచాయతీ, అంగన్వాడీ,స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూప్ భవనాల నిర్మాణానికి ఈ నిధులు కేటాయించినట్లు మంత్రి క్యాంప్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.పంచాయతీ భవనాలకు రూ.60 లక్షలు ఇప్పలపల్లి, ఎడ్లపల్లి, నాచారం గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.60 లక్షలు మంజూరయ్యాయి.
అంగన్వాడీ భవనాలకు రూ.72 లక్షలు.తాడిచెర్లలోని సెంటర్-1, 4, 5, 6, పీవీ నగర్-వల్లెంకుంట సెంటర్-2, ఎడ్లపల్లి సెంటర్-1 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి రూ.12 లక్షల చొప్పున మొత్తం రూ.72 లక్షలు కేటాయించారు.మహిళా సంఘాల భవనాలకు రూ.1.50 కోట్లు చిన్నతూండ్ల,అడ్వాలపల్లి,మల్లారం, తాడిచెర్ల,రుద్రారం,మల్లంపల్లి,దుబ్బపేట,అన్సాన్పల్లి, నాచారం,ఎడ్లపల్లి, కొండంపేట,ఇప్పలపల్లి,వల్లెంకుంట, కొయ్యూర్,పెద్దతూండ్ల గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూప్ భవనాల నిర్మాణానికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.1.50 కోట్లు మంజూరయ్యాయిఈ మూడు విభాగాలకు కలిపి మండలానికి తాజా మంజూరైన నిధులు రూ.2.82 కోట్లు. నిధులు మంజూరైయ్యాయి.







కామెంట్‌లు (0)