Magazines

ఆస్తుల గురించి చెప్పే సోయి లేదు

39 నిమిషాల క్రితం

They have no sense of responsibility regarding the assets.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

అక్రమ సంబంధాలు అంటగడతారా ? : ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆస్తుల గురించి చెప్పే సోయి లేకుండా అక్రమ సంబంధాలు అంటగడతారా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను రాష్ట్ర ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్ లోని సీఎల్పీ మీడియా సెంటర్ లో ఆయన మాట్లాడారు. పదేండ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ నేతలు దోచుకున్న అక్రమాస్తుల వివరాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమ సంబంధాలు అంటగట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారి ఇండ్లలో అక్కా, చెల్లెళ్లు లేరా..? మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా..? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా కేటీఆర్ కవిత ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను కించపరిచే ముందు వారిని కూడా కన్నతల్లి మహిళే అని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఆధారాలు లేకుండా ప్రచారం చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కేటీఆర్, హరీశ్ రావు ఆస్తులపై తాము చూపించిన ఆధారాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్