నవతెలంగాణ - మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వం ప్రకటించిన జిల్లా,మండల ఉత్తమ ఉపాధ్యాయులకు గ్రామ సర్పంచ్ బండి స్వామి ఆధ్వర్యంలో మంగళవారం శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమం జరిగింది. సర్పంచ్ బండి స్వామి ఆధ్వర్యంలో మంగళవారం శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడారు. ఉపాధ్యాయులు దేశానికి వెన్నెముక లాంటి వారని కొనియాడారు.విద్యార్థులు అన్ని రంగాలలో రాణించేలా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదని,వారి సేవలు సమాజానికి ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు.అనంతరం సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుని జీవితం విద్యార్థుల అభ్యున్నతికే అంకితమన్నారు.విద్యార్థుల సంక్షేమానికి,పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు.
ఈ పురస్కారాలు తమపై మరింత బాధ్యతను పెంచాయని, భవిష్యత్తులో మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్. తిరుపతి,సన్మాన గ్రహీతలు సిహెచ్. పూర్ణచందర్, రాధిక, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం పద్మతో పాటు ఉపాధ్యాయులు తిరుపతి, కవిత, మానస,అరుణ్, శ్రీనివాస్, సురేష్, గంగరాజు,రమేష్, సాంబయ్య,పాఠశాల ఉపాధ్యాయ బృందం,సీఆర్‌పీ సమత పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)