నవతెలంగాణ-మల్హర్ రావు
కాటారం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో స్వాధీనం చేసుకున్న 39 ద్విచక్ర వాహనాలు,01 ఆటోను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు ప్రొహిబిషన్,ఎక్సైజ్ అధికారులు మంగళవారం ఒక ప్రకటన తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడారు సదరు వాహనాల బహిరంగ వేలం ఈనెల 8న ఉదయం 10 గంటలకు,ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్,కాటారం ప్రాంగణంలో నిర్వహించబడుతుందన్నారు.
వేలానికి సంబంధించిన నోటిఫికేషన్,వాహనాల వివరాలు,నిబంధనలు,షరతులు ప్రొహిబిషన్,ఎక్సైజ్ స్టేషన్,కాటారం నోటీసు బోర్డుపై ప్రదర్శించబడినవని తెలిపారు.వేలంలో పాల్గొనదలచిన ఆసక్తి గల వ్యక్తులు, ప్రభుత్వం నిర్ణయించిన రుసుము 50 శాతం మొత్తాన్ని డిపాజిట్ చేయవలసి ఉంటుందన్నారు.డిపాజిట్ చేసిన మాత్రమే వేలంలో పాల్గొనేందుకు అనుమతించబడుతుందన్నారు.వేలానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర నిబంధనల కోసం ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్, కాటారం కార్యాలయంలో సంప్రదించాలన్నారు.







కామెంట్‌లు (0)