Magazines

అక్రమంగా ఇండ్లు కూల్చారంటూ కలెక్టరేట్ ముందు బాధితుల ఆందోళన

6 గంటల క్రితం

Victims protest
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

తాడిచర్ల గ్రామపంచాయతీ పరిధిలోని శాత్రాజ్ పల్లిలో రెవెన్యూ, పారెస్టు, పోలీస్, పంచాయతీ, అగ్నిమాపక సంయుక్తంగా అధికారులు అక్రమంగా ఇండ్లను కూల్చారంటూ బాధితులు సోమవారం భూపాలపల్లి జిల్లా కిలెక్టరేట్ ముందు నిరసన చేపట్టి ఆందోళన చేపట్టారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, గ్రామసభ నిర్వహించి సమాచారం అందించకుండా 347 ఇళ్లు, పశువుల కొట్టాలు, ఇతర నిర్మాణాలను అర్థరాత్రి కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.


అప్పులు చేసి ఒక్కొక్క ఇంటికి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేసి నిర్మించుకున్న ఇళ్లను తెల్లవారేసరికి నేలమట్టం చేయడంతో రోడ్డున పడ్డామని కన్నీటిపర్యంతమైయ్యారు. ప్రభుత్వం, కలెక్టర్ స్పందించి నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని లేదంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు. కూల్చివేతలపై సమగ్ర విచారణ జరిపి, బాధితులకు నష్టపరిహారం అందించాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్