Magazines

గ్రామాల్లో కలెక్టర్‌ సుడిగాలి పర్యటన

2 గంటల క్రితం

Collector
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

కూలీలకు విభిజి గ్రాంజీ ద్వారా ఉపాధి కల్పించాలి

జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా

నవతెలంగాణ-కుభీర్
ఎల్‌నినో ప్రభావంతో ఏడాది పాటు వర్షాలు పడే పరిస్థితి లేదనీ, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని జిల్లా కలెక్టర్‌ భవిష్‌ మిశ్రా ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం మండల పరిధిలోని పార్టీ-బీ గ్రామంలో నీటీ పారుదల శాఖ అధికారులతో కలిసి కలెక్టర్‌ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో నీటి సమస్య తీవ్రంగా ఉండబోతోందనీ, నీటిని వృధా చేయొద్దనీ, ప్రతి ఒక్కరు పొదుపుగా వాడుకోవాలని విజ్క్ష‍ప్తి చేశారు. అధికారులతో కలిసి గ్రామాల్లో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల ఎన్ని ఉన్నాయి, వాటి పరిస్థితి ఎలా ఉందని పంచాయతీ సభ్యులను అడిగితెలుసుకున్నారు.


వీబీజీ గ్రామ్‌జీ పథకం ద్వారా కూలీలకు పని కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామపంచాయతీ 25% నిధులు చెల్లిస్తే 75% జిల్లా కలెక్టర్ నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అనంతరం గ్రామమలో పలువురు ఇందిరమ్మ ఇండ్లు, వికాలంగుల పెన్షన్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ముందు లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కలెక్టర్‌ ప్రతిస్పందిస్తూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం పథకాలు అందేందుకు కృషి చేస్తామని చెప్పారు.


అదేవిధంగా హల్డా గ్రామంలో పర్యటించిన కలెక్టర్‌.. షీలింగ్‌ భూములను పరిశీలించి, అర్హులైన వారికి పట్టాలందిస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటు గ్రామంలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వస్తే సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు మడి ప్రవీణ్, రజిత దేవేందర్, తాసిల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో భూమారావు ఎంపీ ఓ భీమేష్, నీటిపారుదల శాఖ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, ఆయా శాఖలకు చెందిన అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

Collector



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్