సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య
నవతెలంగాణ-మర్రిగూడ
జిల్లా కేంద్రంలో ఈనెల 15 నుండి 18 వరకు జరిగే అఖిలభారత 36వ రైతు మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని లెంకలపల్లి గ్రామంలో మహాసభలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మహాసభలలో ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు, సమస్యల పరిష్కారానికి భవిష్యత్తు కార్యచరణ రూపొందించడం జరుగుతుందన్నారు.
రైతు సమస్యలపై జరుగుతున్న అఖిలభారత రైతు మహాసభలను మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా ప్రాజెక్టులకు నీటిని నింపే విషయంలో ప్రభుత్వం కాలయాపన చేయకుండా ఏదుల్ల రిజర్వాయర్ నుండి డిండి ప్రాజెక్టుకు నీటిని నింపి సింగరాజుపల్లి, గొట్టుముక్కల, లక్ష్మణపురం, మండలంలోని శివన్నగూడ రిజర్వాయర్ లకు నీటిని నింపాలని, పెండింగ్ లో ఉన్న రిజర్వాయర్ ల పనులు కూడా త్వరగా పూర్తి చేసి మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు తాగు, సాగునీరు అందించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏర్పుల కృష్ణ, జిపి వర్కర్ ఏర్పుల చిన్న మల్లయ్య, ఏర్పుల మల్లయ్య, ఏర్పుల యాదయ్య, ఏర్పుల నరసింహ, ఏర్పుల మల్లమ్మ, ఏర్పుల సుగుణమ్మ, ఏర్పుల భారతమ్మ, ఏర్పుల బిక్షపమ్మ, ఏర్పుల పెద్ది మల్లమ్మ, ఏర్పుల లక్ష్మమ్మ, ఏర్పుల జంగమ్మ, ఏర్పుల యాదమ్మ, ఏర్పుల మాధవి, ఏర్పుల లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)