నవతెలంగాణ-మద్నూర్
బుధవారం సర్పంచులు, కార్యదర్శులతో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, పంచాయతీరాజ్ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రానున్న రోజుల్లో క్లిష్ట పరిస్థితులను రాష్ట్ర ప్రజలు ఎదుర్కొనుటకు సిద్దంగా ఉండాలని ఎంపీడీఓ సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందనీ, దీని నివారణకు ప్రభుత్వం సూచించిన ఆదేశాలను అధికారులు పకడ్బంధీగా అమలు చేయాలని తెలిపారు. ఇందుకు అన్ని శాఖలు సమన్వయంతో గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డోంగ్లి, మద్నూర్ ఎంపీడీఓలు సంయుక్తంగా వెల్లడించారు. కార్యక్రమంలో ఏపీవో పద్మ, ఏపిఎం జగదీష్ కుమార్, ఆర్డబ్ల్యుఎఫ్ ఏఈ మహబూబ్, హౌసింగ్ ఏఈ, వివిధ శాఖల అధికారులు గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)