Magazines

ఆష్టలో బయటపడ్డ పురాతన విగ్రహాలు

11 నవంబర్, 2026

Ancient statues
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - ముధోల్
ముధోల్ మండలంలోని ఆష్ట గ్రామంలో పాత ఊర్లో విబిజి రామ్ జీ పథకం కింద ఫారం పండు పనులను ఉపాధి కూలీలు చేపడుతుండగా బుధవారం రోజు పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. ఈ విషయాన్ని వెంటనే కూలీలు స్థానిక సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ కుసమాచారం అందించారు. వెంటనే సర్పంచ్ అక్కడ చేరుకొని, మిగతా పనులు చేయించటంతో ఈ విగ్రహాలు దర్శనమిచ్చాయి. శివలింగం, నంది, కాలభైరవ రూపంతోపాటు మరిన్ని పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. దీంతో ఉపాధి కూలీలు పురాతన విగ్రహాలకు పూజలు నిర్వహించారు. విగ్రహాలు బయటపడటంతో సర్పంచ్ స్పందించారు. తాత్కాలిక పనులు చేపట్టి, భక్తుల  దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని సర్పంచ్ నవతెలంగాణకు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్