Magazines

ప్రజా సేవలో మరో ముందడుగు

22 నిమిషాల క్రితం

public service
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - భీంగల్ 

సామాజిక సేవే లక్ష్యంగా పనిచేస్తున్న ‘అమ్మ చారిటబుల్ ట్రస్ట్’ నూతన కార్యాలయం భీంగల్ మండల కేంద్రంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) గంగుల సంతోష్ కుమార్ రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ మాట్లాడుతూ... పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ పథకాలతో పాటు ఇలాంటి చారిటబుల్ ట్రస్టుల ద్వారా అందించే సేవలు నిరుపేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ట్రస్ట్ చేపట్టే సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.


అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు పుల్ల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మండల పరిధిలోని నిరుపేదలకు నిత్య అన్నదానం.విద్య, వైద్యం. మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ.మరియు ఇతర అత్యవసర సమయాల్లో అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, హరీష్. అజయ్. పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్