హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి
నవతెలంగాణ - పరకాల
పరకాల పరిధిలో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు సంబంధిత రైతులు అధికారులకు సహకరించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి కోరారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో గట్ల కానిపర్తి, మాదారం గ్రామాలకు చెందిన రైతులు, సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా భూసేకరణ ప్రక్రియలో ఎదురవుతున్న అంశాలపై రైతులతో చర్చించారు.గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే తుది దశకు చేరుకుందని, మిగిలి ఉన్న పనులను పూర్తి చేసేందుకు రైతులు సహకరించాలని అదనపు కలెక్టర్ సూచించారు. అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లడంలో భూసేకరణ కీలకమని, ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు అధికారులు, రైతులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.ఈ సమావేశంలో నేషనల్ హైవే పీడీ భరద్వాజ్, పరకాల ఆర్డీవో డీఎస్. వెంకన్న, పరకాల తహసీల్దార్ విజయలక్ష్మి, భూసేకరణ విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, గట్ల కానిపర్తి, మాదారం గ్రామాల రైతులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)