Magazines

ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18000 ఇవ్వాలి

6 గంటల క్రితం

Asha Workers
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

ఇన్సూరెన్స్ సౌకర్యం రూ.50 లక్షలు కల్పించాలి

నవతెలంగాణ-అచ్చంపేట
ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18000/- ఇవ్వాలని, ప్రతి ఆశ కార్యకర్తకు ఇన్సూరెన్స్ సౌకర్యం రూ.50 లక్షలు కల్పించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆశా వర్కర్ల ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నిరసన చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పిఏ విష్ణుకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.


ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ.. రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలన్నారు. ఆశా కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే డిసెంబర్ 15 నుండి నిరవధిక సమ్మెకు వెళతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మల్లేష్,  సిఐటియు పట్టణ కార్యదర్శి బి. రాములు , రైతు సంఘం జిల్లా నాయకులు సైదులు, రాశా వర్కర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రజిత సైదమ్మ, అలివేల ,  సువర్ణ , రోజా , భాగ్యమ్మ, ఆశ కార్యకర్తలు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్