Magazines

పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్

1 రోజు క్రితం

poker
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - భీంగల్ 

ఆదివారం రాత్రి నగరంలో పేకాటరాయుళ్లపై దాడి చేసి ఏగురురిని అరెస్టు చేశామని భీంగల్‌ ఎస్సై చిరంజీవి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని గౌడ సంఘం వద్ద పేకాట ఆడుతున్నట్టు నమ్మదగిన సమాచారం మేరకు దాడులు చేశామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏడుగురు పేకాట రాయుళ్లతో పాటు రూ.11,400/- నగదు, 7 ద్విచక్ర వాహనాలు, 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రజలు ఎవరూ జూదం, పేకాట, బెట్టింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవద్దని చెప్పారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్