Magazines

పరిశుభ్రతలో భీంగల్‌ను ప్రథమ స్థానంలో నిలవాలి

10 నవంబర్, 2026

cleanliness
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు: మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్

నవతెలంగాణ - భీంగల్‌
పరిశుభ్రతలో భీంగల్‌ మున్సిపాలిటీని జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేద్దామని మున్సిపల్ కమిషనర్ గజనంద్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన పట్టణంలోని కుప్కల్ రోడ్డులో రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు, వ్యర్థాలను జేసీబీతో తొలగింపజేశారు.


ఈ సందర్భంగా కమీషనర్‌ మాట్లాడుతూ.. పట్టణ వాసులు రోడ్లపై చెత్తవేయొద్దనీ, ముఖ్యంగా వ్యాపారస్తులు తమ దుకాణాల నుంచి వెలువడే చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా మున్సిపాలిటీ వాహనాలకు అందించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే మున్సిపల్ చట్టం-2019 ప్రకారం జరిమానా విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచడం కేవలం మున్సిపాలిటీ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. ప్రజలు, వ్యాపారస్తులు మున్సిపాలిటీకి సహకరించి భీంగల్ పట్టణాన్ని పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్