Magazines

ఓటు చోరీ అంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం 

3 గంటల క్రితం

allegations
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

- బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజూగుల నాగేందర్ గౌడ్

నవతెలంగాణ - తిమ్మాజిపేట

ఓటు చోరీ పేరుతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజూగుల నాగేందర్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన మండల కేంద్రంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజూగుల నాగేందర్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సార్ ) అనేది కొత్త కార్యక్రమం కాదని, గతంలో కూడా రాజ్యాంగబద్ధంగా ఎన్నికల ప్రక్రియలో భాగంగా నిర్వహించిన కార్యక్రమమేనని పేర్కొన్నారు. దేశంలో డబుల్ ఓట్లు, మరణించిన వ్యక్తుల పేర్లతో కొనసాగుతున్న ఓట్లు, ఒక ప్రాంతానికి చెందకుండా మరో ప్రాంతంలో ఓటరుగా నమోదైన వారి వివరాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం ఓటరు జాబితాను ప్రక్షాళన చేయడమే సార్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.


ఈ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో కలెక్టర్, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, మండల స్థాయిలో తహసీల్దార్, గ్రామస్థాయిలో బూత్ లెవల్ అధికారులు పర్యవేక్షిస్తున్నారని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలని, ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలనే రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఈ ప్రక్రియ జరుగుతోందని అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో ఇప్పటివరకు ఓట్లు తొలగించబడ్డాయని పేర్కొంటూ తన ఓటు పోయిందని దరఖాస్తు చేసుకున్నవారు పది మంది కూడా లేరని, దీనిని బట్టి అధికారులు జాగ్రత్తగా సర్ ప్రక్రియ నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు జెట్టి వెంకటేష్, మండల అధ్యక్షుడు యశ్వంత్, జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు నరేష్ చారి, జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మ అనిల్, వేణు, రాజశేఖర్, దాచేపల్లి నిశ్వంత్, రంజిత్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్