నవతెలంగాణ-సత్తుపల్లి
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం 'రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ'ని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కావేటి అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఈ ర్యాలీలో బండారు మారేశ్వరరావు, కోటమర్తి జవహర్లాల్, మొగిలిచర్ల సత్యనారాయణ, ఎక్కిరాల కృష్ణారావు, కువ్వారపు మోహన్రావు, గిరిబాబు, చిన్ని వెంకటేశ్వరరావు, కాలసాని నాగేశ్వరరావు, బండారు చిన్న మహేశ్వరరావు, రాచమళ్ల నాగేంద్రరావు పాల్గొన్నారు.






కామెంట్లు (0)