Magazines

అనారోగ్య బాధితులకు రూ.3.10 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

7 నిమిషాల క్రితం

81980f63
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో నలుగురు లబ్ధిదారులకు ఆర్థిక భరోసా

నవతెలంగాణ – చండూర్ : అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్‌) ఆర్థికంగా అండగా నిలుస్తోందని అంతంపేట గ్రామ సర్పంచ్ చందా శ్రీలత వెంకటేశం అన్నారు. గట్టుప్పల మండలంలోని అంతంపేట గ్రామానికి చెందిన నలుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ.3.10 లక్షల విలువైన చెక్కులను సోమవారం ఆమె పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. చికిత్స కోసం అధిక మొత్తంలో వైద్య ఖర్చులు కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఖర్చుల భారం తగ్గించుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో వారి దరఖాస్తులకు ఆమోదం లభించి మొత్తం రూ.3.10 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది.

ఈ సందర్భంగా సోమవారం అంతంపేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చందా శ్రీలత వెంకటేశం లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చులు భారంగా మారుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన బాధితులకు ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందేలా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవడం అభినందనీయమన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు లెంకలపల్లి శంకరాచారి, మాజీ సర్పంచ్ మాదగోని శేఖర్ గౌడ్, రెండో వార్డు సభ్యుడు లెంకలపల్లి రాఘవేంద్ర చారి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్