- మండల పంచాయతీ అధికారి బీమేష్..
నవతెలంగాణ కుభీర్ : మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు తమ సమస్యలు ఏమైనా ఉంటే ప్రజా వాణిలో దరఖాస్తులు చేసుకోవాలని మండల పంచాయతీ అధికారి అష్టం బీమేష్ అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వాణికి ఒక్క ధరకస్తు వచ్చినట్లు ఎంపీఓ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ధరకస్తు చేసుకోవడం జరిగిందని ఎంపీఓ తెలిపారు. ఈ సందర్బంగా ఆయా గ్రామల్లో ఉన్న ప్రజలు ప్రజా వాణికి అన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరుకావడంతో వారి వారి శాఖకు సంబదించిన సమస్యలను తెలిపినట్లుతే వారి సమస్యను పరిష్కరించే విధంగ చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమానికి మండల విద్య అధికారి విజయ్ కుమార్, విద్యుత్ శాఖ కదం ఆదిత్య ఐకేపి దత్తాత్రి, హరిలాల్ వైద్య, ఐసీఐడీస్ మిగితా శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు.






కామెంట్‌లు (0)