Magazines

ప్రతీ ప్రత్యేక అవసరాల విద్యార్థిని గుర్తించాలి

1 గంట క్రితం

special needs
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – అశ్వారావుపేట

ప్రశస్త్ యాప్ ద్వారా ప్రత్యేక అవసరాల విద్యార్థులను గుర్తించి, వారి వివరాలను యాప్‌లో నమోదు చేయాలని మండల విద్యాశాఖ అధికారి పి. ప్రసాదరావు సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మండల స్థాయిలో ఏర్పాటు చేసిన ప్రశస్త్ శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.


ప్రత్యేక అవసరాల విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ యాప్‌ను రూపొందించిందన్నారు. ప్రతి విద్యార్థిని స్క్రీనింగ్ చేసి, వారి అవసరాలను గుర్తించి, అందుకు అనుగుణంగా విద్యాబోధన అందించడంతో పాటు వివరాలను యాప్‌లో నమోదు చేయాలని తెలిపారు.


ఈ కార్యక్రమంలో ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుడు అన్నవరపు రాంమోహన్ శిక్షకుడిగా వ్యవహరించి ఉపాధ్యాయులకు ప్రశస్త్ యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులు హరీష్, ఐఈఆర్‌పీలు రామారావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్