Magazines

సీపీఐ(ఎం) పాదయాత్రను జయప్రదం చేయండి 

1 గంట క్రితం

CPIM
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

•ఆ పార్టీ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య 

నవతెలంగాణ-మర్రిగూడ 

మండలంలో శివన్నగూడ రిజర్వాయర్ నుండి ఆదివారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జరిగే పాదయాత్రను జయప్రదం చేయాలని ఆ పార్టీ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య పిలుపునిచ్చారు. శనివారం స్థానికంగా ఆయన మాట్లాడారు. పాదయాత్రను ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు.


డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని,శివన్నగూడ రిజర్వాయర్ నుండి రాచకొండ ఎత్తిపోతల పథకం మంజూరు చేసి నారాయణపురం మండలానికి సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర కొనసాగుతుందన్నారు. పాదయాత్ర కు పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఏండీ జహంగీర్, పార్టీ జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారని, మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్