నవతెలంగాణ-అశ్వారావుపేట
అశ్వారావుపేట పట్టణంలో ఎస్‌ఐ దేవ్‌సింగ్ ఆధ్వర్యంలో సోమవారం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలు, కార్లు తదితర వాహనాలను తనిఖీ చేసి, వాహనదారుల వద్ద అవసరమైన ధ్రువపత్రాలను పరిశీలించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలని ఎస్‌ఐ దేవ్‌సింగ్ సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.







కామెంట్‌లు (0)