Magazines

బెల్ట్‌షాపులో గొడవ..వ్యక్తికి తీవ్ర గాయం

2 గంటల క్రితం

seriously injured
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - అశ్వారావుపేట

మద్యం సేవిస్తున్న సమయంలో స్థలం వివాదం నేపథ్యంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుని ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన అశ్వారావుపేటలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏఎస్ఆర్ కాలనీకి చెందిన దాచేపల్లి వీరభద్రం అశ్వారావుపేట - జంగారెడ్డిగూడెం రోడ్డులోని ఓ బెల్ట్‌షాపులో మద్యం సేవిస్తుండగా, పక్కనే ఉన్న పసుపులేటి రామస్వామితో స్థలం విషయమై వాగ్వాదం జరిగింది.


ఈ క్రమంలో రామస్వామి బీరు సీసాతో వీరభద్రంపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఘటనలో తీవ్రంగా గాయపడిన వీరభద్రాన్ని తొలుత అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి కుమారుడు దాచేపల్లి ధర్మతేజ ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ ఎం. కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్