- సైడ్ డ్రైనేజీలు నిర్మించి సీసీ రోడ్డు వేయాలని స్థానికుల విజ్ఞప్తి
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మున్సిపాలిటీ 22వ వార్డులోని ఏ వన్ కిడ్స్ స్కూల్ రోడ్డు ఇటీవల కురిసిన మురసు తుఫాన్ భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నది. సైడ్ డ్రైనేజీలు లేకపోవడంతో వర్షపు నీరు రోడ్డుపై ప్రవహించి రోడ్డును కొట్టుకుపోయేలా చేసిందని స్థానికులు తెలిపారు.
సీతారామరాజు కాలనీ, ఇందిరా కాలనీ, డ్రైవర్స్ కాలనీ, పాత పేరాయిగూడెం, బీఎస్ నగర్ ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లేందుకు ఈ రహదారినే దగ్గరి మార్గంగా వినియోగిస్తున్నారు.
హైవే మార్గంలో వెళ్లే సమయంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో పలువురు ఈ షార్ట్కట్ రహదారినే ఆశ్రయిస్తున్నారు.
నిత్యం పాఠశాలకు వచ్చే విద్యార్థుల తల్లిదండ్రుల వాహనాలతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. భారీ వర్షాలకు రోడ్డు కొట్టుకుపోవడంతో పాటు ఇసుక పేరుకుపోయి వాహనాలు జారిపడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చిన్నపాటి మరమ్మతులను పాఠశాల యాజమాన్యమే సొంతంగా చేపట్టేదని తెలిపారు.
రోడ్డుకు ఇరువైపులా సైడ్ కాల్వలు నిర్మించి, దెబ్బతిన్న రహదారిని సిమెంట్ రోడ్డుగా అభివృద్ధి చేసి ప్రజలకు సురక్షిత రవాణా సౌకర్యం కల్పించాలని 22వ వార్డు ప్రజలు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. ఈ విషయం అయి కమీషనర్ దిలీప్ రెడ్డి ని వివరణ కోరగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం అని త్వరితగతిన పూర్తి చేస్తాం అని అన్నారు







కామెంట్లు (0)