Magazines

ఘనంగా 'ఫ్యామిలీ డే-బతుకమ్మ' సంబురాలు

1 గంట క్రితం

Bathukamma
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి 

​సింగరేణి సత్తుపల్లి ఏరియా పరిధిలోని స్థానిక మున్సిపాలిటీ పీవీఎన్ఆర్ సెంటనరీ కాలనీలో ఫ్యామిలీ డే, బతుకమ్మ వేడుకలు శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సింగరేణి సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ సరికొండ వెంకటాచారి, సేవా సమితి ప్రెసిడెంట్ సరికొండ ఇందిరాదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


ఈ కార్యక్రమంలో ​సీఎంఓఏఐ ఏఎల్ఎస్వీ సునీల్ వర్మ, ఎస్ఓ టు జీఎం శ్రీనివాస్, ఏరియా ఇంజనీర్ కె. సోమశేఖరరావు పాల్గొన్నారు. ​ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ యస్. సుధాకర్, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ బి. కోటేశ్వరరావు, 

​సింగరేణి అధికారులు, ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్