నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ
విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ఆదివారం నగరంలో దక్షిణాది సినీ నటి నిధి అగర్వాల్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ యజమానులు తొడుపునూరి శ్రీనివాస్, పాలభట్ల ఆనంద్ బాబులు కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీనటి నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సంప్రదాయ కళాత్మకతను ఆధునిక శైలితో మేళవించిన విభిన్నమైన డిజైన్లు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు.
అనంతరం అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి బ్రాండ్ షోరూమ్ రావడం ఎంతో గర్వంగా ఉందనీ, మరిన్ని ఇతర బ్రాండ్లు హైదరాబాద్ తో సమానంగా నిజామాబాద్ లో ఏర్పాటు చేసి జిల్లా ప్రజలకు ఉపాధి అవకాశాలు, పట్టణ అభివృద్ధి పెరగాలి అని తెలిపారు.
అదేవిధంగా విశిష్ట యజమాని తొడుపునూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సంప్రదాయ ఆభరణాల తయారీ నైపుణ్యాన్ని ఆధునిక డిజైన్లతో సమన్వయం చేస్తూ అద్భుతమైన ఆభరణాల కలెక్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. మహిళలు, పురుషుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బంగారు, వజ్రాభరణాలతో పాటు నెక్లెస్లు, బ్రాస్లెట్లు, చెవి ఆభరణాలు, ఉంగరాలు తదితర విస్తృత శ్రేణి ఆభరణాలు తమ షోరూమ్లో అందుబాటులో ఉన్నాయని వివరించారు.
విశిష్ట యజమాని పాలభట్ల ఆనంద్ బాబు మాట్లాడుతూ.. నైపుణులైన కళాకారులచే ప్రతి ఆభరణాన్ని ఎంతో శ్రద్ధతో, ప్రత్యేకమైన డిజైన్లలో వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా రూపొందిస్తారని తెలిపారు. మరిన్ని నూతన డిజైన్లను వినియోగదారులకు ముందు ఉంచుతామని పేర్కొన్నారు.
నిధి అగర్వాల్ రాకతో షోరూం పరిసర ప్రాంతాలు సందడిగా మారింది. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆప్యాయంగా అభివాదం చేస్తూ డాన్స్ చేసి నగర ప్రజలకు నూతన ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వ్యాపారవేత్తలు నగర ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)