జిల్లా అదనపు కలెక్టర్ వెంకట మాధవ్ రావు..
నవతెలంగాణ-కుభీర్
గ్రామల్లో పెండింగ్ లో ఉన్న భూ సర్వేలను ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకట మాధవ్ రావు అధికారులకు సూచించారు. గురువారం మండలంలోని బాకోట గ్రామంలో భూ సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తప్పులు లేకుండా భూ సర్వే పకడ్బందీగా చేపట్టాలని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పారు. అదేవిధంగా ఇప్పటి వరకు భూ సర్వే పనులు ఎంత వరకు జరగాయని తహసీల్దార్ శ్రీదేవిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం అక్కడి నుంచి మండల కేంద్రమైన కుభీర్ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని పలు రికార్డులను పరిశీలించారు. కార్యాలయనికి వచ్చే ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీదేవి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరేష్,శ్రీనివాస్ సర్వేయర్ గంగాధర్ రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.






కామెంట్‌లు (0)