- అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నవతెలంగాణ - అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీ సర్వేను పారదర్శకంగా, త్వరితగతిన పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. మండలంలోని కన్నాయిగూడెంలో మంగళవారం జరుగుతున్న రీ సర్వే పనులను సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ దాసరి కిశోర్, డిప్యూటీ సర్వేయర్ నాగరాజుకు పలు సూచనలు చేశారు.
మొదటి దశలో ఎంపికైన దురదపాడు, మొద్దులుమడ, ఖమ్మంపాడు, అనంతారం, రామన్నగూడెం, కన్నాయిగూడెం రెవెన్యూ గ్రామాల్లో రామన్నగూడెం, దురదపాడు రీ సర్వే పూర్తయిందని, ప్రస్తుతం కన్నాయిగూడెంలో పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. ఇప్పటివరకు సర్వే, మ్యాపింగ్ లేని కన్నాయిగూడెం రెవెన్యూ గ్రామానికి ఈ సర్వేతో శాశ్వత పరిష్కారం లభించనుందని పేర్కొన్నారు.
రీ సర్వే ద్వారా అటవీ, రెవెన్యూ, పట్టా, ఆబాదీ భూముల వివరాలు స్పష్టంగా తేలనున్నాయని తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)