- సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు కువ్వారపు లక్ష్మణరావు
నవతెలంగాణ-సత్తుపల్లి
ఈ నెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నల్గొండ పట్టణంలో జరగనున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలను రైతులు, ప్రజానీకం పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు కువ్వారపు లక్ష్మణరావు కోరారు. శుక్రవారం సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో ఏఐకేఎస్ జాతీయ మహాసభల ప్రచార కార్యక్రమంలో భాగంగా వాల్‌పోస్టర్లను స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ఈ మహాసభల్లో భవిష్యత్ పోరాట కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. పంటలకు కనీస మద్దతు ధర చట్టబద్ధత, రుణమాఫీ తదితర సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఈ మహాసభలకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు ఆంగోతు చిట్టెమ్మ, వెంకటలక్ష్మి, శశిరేఖ, గుణ, చుక్కమ్మ, లక్ష్మి, కువ్వారపు రాజేశ్వరి, చిన్న లక్ష్మి, బెజవాడ కృష్ణ, బూరుగు వెంకటయ్య, ఎస్కే హుస్సేన్ పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)