Magazines

సామాజిక బాధ్యతను చాటుకున్న పవన్ కళ్యాణ్ సేవా సమితి సభ్యులు

29 నిమిషాల క్రితం

Members of the Pawan Kalyan Seva Samithi demonstrate social responsibility
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

- అనాధ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహణ

నవతెలంగాణ – అశ్వారావుపేట

సామాజిక బాధ్యతను చాటుతూ పవన్ కళ్యాణ్ సేవా సమితి సభ్యులు అనాధ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అశ్వారావుపేటలోని అనాధాశ్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడికి బంధువులు, ఆప్తులు ఎవరూ లేకపోవడంతో విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ సేవా సమితి సభ్యులు స్పందించారు.


బుధవారం కుండపోత వర్షం కురుస్తున్నప్పటికీ దానిని లెక్కచేయకుండా సేవా సమితి సభ్యులు మృతదేహానికి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహానికి పూలమాల వేసి, నూతన వస్త్రాలు కప్పి అంత్యక్రియల కోసం తరలించారు.

ఈ కార్యక్రమంలో డేగల రాము, నాగబాబు నాయుడు, మాజీ వార్డు సభ్యుడు లక్ష్మణరావు, మానేపల్లి ఏసు, మీసాల శ్రీను, కొట్టే అనీల్‌తో పాటు పవన్ కళ్యాణ్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అనాధ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్న సేవా సమితి సభ్యులను స్థానికులు అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్