Magazines

‘బారికేడ్లు తొలగించాలి.. లేకుంటే 15న భారీ ధర్నా’

29 నిమిషాల క్రితం

Kushaiguda Bus Stop
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ-నాచారం:

కుషాయిగూడ బస్ స్టాప్ పరిరక్షణ కోసం స్థానిక కాలనీల ప్రజలు, వ్యాపారులు ఐక్యంగా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. బస్ స్టాప్ వద్ద ఉన్న షెల్టర్‌ను, కుర్చీలను మార్కెట్ వైపు వెనక్కి జరిపేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకున్నారు. బస్ షెల్టర్‌ను యథావిధిగా కొనసాగించాలని అధికారులతో చర్చించి, తరలింపు ప్రయత్నాన్ని నిలిపివేయించారు. బస్సుల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న పూల దుకాణాలను సైతం వెనక్కి జరిపించారు.


కుషాయిగూడలో రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారికేడ్లను తొలగించాలని ట్రాఫిక్ సీఐని కోరగా, ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాలనీల ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ.. నవంబర్ 10వ తేదీలోగా బారికేడ్లను తొలగించకపోతే రాజకీయాలకు అతీతంగా ఐక్య ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. నవంబర్ 15వ తేదీన కుషాయిగూడ బస్ స్టాప్ వద్ద అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, కాలనీ సంఘాల సభ్యులతో కలిసి భారీ ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. ధర్నాకు మద్దతుగా ఒకరోజు వ్యాపార దుకాణాలను బంద్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.


కుషాయిగూడ బస్ స్టాప్‌పై సుమారు 25 నుంచి 30 కాలనీల ప్రజలు రవాణా అవసరాల కోసం ఆధారపడుతున్నారని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బారికేడ్లను తొలగించి బస్ స్టాప్‌ను యథావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రజలందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో కుషాయిగూడ కాలనీల ఐక్యవేదిక నాయకులు పనగట్ల చక్రపాణి, చల్ల ప్రభాకర్, గణేష్ ముదిరాజ్, పంజాల బాబు గౌడ్, కొడకండ్ల యాదయ్య, బింగి భిక్షపతి గౌడ్, సల్ల వెంకటేష్, జైకృష్ణ, హరిలాల్ నాయక్, పిట్ల రాజు ముదిరాజ్, నలచెరువుల జనార్దన్, దయానంద్, సుధాకర్, రమేష్ చౌదరి, పులి నరేందర్, గోపి, సంపత్, ధీరావత్ బాలాజీ నాయక్, మనోహర్, కాసుల నందం గౌడ్, అనిల్ యాదవ్, నర్సింగ్ రావు, బన్నాపురం నాగరాజు, జి. కృష్ణకుమార్, ఉల్లిగడ్డ వెంకటేష్, అనిల్, వినయ్, నీల రాజేష్, రాజు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్