Magazines

తుంబూరులో ఎంఎస్ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక

2 గంటల క్రితం

MSF elects new committee
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 1 నిమిషాల చదవడం

- అధ్యక్షుడిగా యుగంధర్‌

నవతెలంగాణ-సత్తుపల్లి 

​పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సత్తుపల్లి ఎంఎస్పీ మండల అధ్యక్షుడు గద్దల దేవయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షుడు దాట్ల నాగరాజు మాదిగ సారథ్యంలో తుంబూరు గ్రామంలో ఎంఎ‌స్ఎఫ్ కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ఎంఎ‌స్ఎఫ్ అధ్యక్షుడిగా జంజునూరి యుగంధర్‌ మాదిగ, ఉపాధ్యక్షుడిగా జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు మాదిగను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విద్యార్థుల్లో సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయంపై చైతన్యం తెచ్చేలా నూతన కమిటీ పనిచేయాలని నాయకులు ఆకాంక్షించారు.


ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచిత విద్య అందుబాటులో ఉండేలా అవగాహన కల్పించాలని కోరారు. సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని నూతన కమిటీకి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు గోళ్లమూడి శ్రీనివాసరావు మాదిగ, సత్తుపల్లి మండల ప్రధాన కార్యదర్శి పరిగడుపు లక్ష్మణ్ మాదిగ, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన కమిటీకి అభినందనలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్