ధనుష్ హీరోగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓం – చాప్టర్ 1: ఉధిరం – ది బ్లడ్ వుడ్’. ఈ సినిమా నుంచి హీరోయిన్ సాయిపల్లవి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో విడుదలైంది. ఈ సినిమాలో ఆమె నిత్యారెడ్డి అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. గతంలో సీబీఐ, ఇంటర్ పోల్‌లో పనిచేసిన ఆమె.. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ ఓం’ను ఆమె లీడ్ చేస్తుంది. అధికారాన్ని ప్రతిబింబించే బాడీ లాంగ్వేజ్, లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో పాటు నిత్యారెడ్డి పాత్రలోని విభిన్న కోణాలను ఈ వీడియోలో చూపించారు. సహజమైన నటన, హావభావాలతో ప్రేక్షకులను మెప్పించే సాయిపల్లవి.. నిత్యా రెడ్డి పాత్రతో మరో కొత్త సవాల్‌ను స్వీకరించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ధనుష్ ‘ఓం ఫస్ట్ స్ట్రైక్’, మమ్ముట్టి ‘బర్మా కార్తికేయన్’ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలకు అభిమానుల నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్‌తో పాటు ఇటీవల వచ్చిన రెండో పాట ‘వీళా వీరా’ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్‌పై శ్రద్ధా అగర్వాల్ నిర్మిస్తోన్న ఈ సినిమాను ధనుష్‌కు చెందిన వండర్‌బార్ ఫిల్మ్స్‌తో కలిసి రూపొందిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది.
పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ నిత్యారెడ్డి..
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 26, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)