Magazines

తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తెస్తారా?

1 గంట క్రితం

Will water be brought from Thummidihetti to Yellampalli?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 1 నిమిషాల చదవడం

నేను రెడీ...నీళ్లు రాకుంటే మీరు రాజీనామా చేస్తారా?

మంత్రి ఉత్తమ్‌‌కు మాజీమంత్రి హరీశ్‌‌రావు సవాల్‌

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణం పట్ల తమకు అభ్యంతరం లేదని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌‌రావు అన్నారు. అయితే తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు ఎలా తెస్తారని ప్రశ్నించారు. ఒకవేళ తెస్తే తాను రాజీనామా చేస్తాననీ, నీళ్లు రాకుంటే రాజీనామా చేస్తారా?అని మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డికి సవాల్‌ ‌విసిరారు. సోమవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో హరీశ్‌‌రావు మీడియాతో మాట్లాడుతూ తుమ్మిడిహెట్టి డీపీఆర్‌ ‌బయటపెట్టాలని డిమాండ్‌ ‌చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని తేల్చిన తర్వాతే మేడిగడ్డకు పోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరమనీ, కరువును తరిమికొట్టే శక్తి ఆ ప్రాజెక్టుకు ఉందన్నా రు. మేడిగడ్డ మరమ్మత్తు వెంటనే చేయాలని డిమాండ్‌ ‌చేశారు. కన్నెపల్లి పంపుహౌస్‌‌లను ప్రారంభించాలని కోరారు. తమకు రాజకీయాలు ముఖ్యం కాదనీ, తెలంగాణ ప్రయోజనాలే ప్రధానమని అన్నారు. తుమ్మిడిహట్టి ఎత్తు 152 మీటర్లకు ప్రయత్నం చేస్తున్నారనీ, మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే మంచిదేనని చెప్పారు. కానీ అక్కడ నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ మూడు లేఖలు మూడుసార్లు చెప్పిందనీ, ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పిందని గుర్తు చేశారు. ఇవన్నీ ఆలోచించి కేసీఆర్‌ ‌కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని వివరించారు. డైవర్షన్‌ ‌పాలిటిక్స్‌ ‌చేయడం కాంగ్రెస్‌‌కు అలవాటుగా మారిందన్నారు. పట్టిసీమ మోటార్ల ద్వారా చంద్రబాబు నీళ్లు ఎత్తితే దేవాదుల నుంచి ఎందుకు నీళ్లు ఎత్తడం లేదని సీఎం రేవంత్‌‌రెడ్డిని ప్రశ్నించారు. ఎన్ని రోజులు, ఎన్ని గంటలు మోటార్లు నడిపించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. దేవాదుల, కల్వకుర్తి మోటార్లను నడిపి ఉంటే ప్రజలకు ఇబ్బందులు వచ్చేవి కాదన్నారు. అందుకే ఇది కాలం తెచ్చిన కరువు కాదనీ, కాంగ్రెస్‌ ‌తెచ్చిన కరువని విమర్శించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్