Magazines

దూసుకొస్తున్న అర్నబ్‌

1 గంట క్రితం

Arnab Storm
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

రేపు తీరం దాటే అవకాశం

ఏపీ, దక్షిణ ఒడిశాకు రెడ్‌ అలర్ట్‌

రాష్ట్రంలోనూ పలు జిల్లాలకు వర్షసూచన

8 జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక జారీ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్‌ ‌తుపాన్‌ బుధవారం తీరం దాటే అవకాశముందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి స్టెల్లా ప్రకటించారు. తుపాన్‌ ‌నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌‌ను జారీ చేసింది. ప్రస్తుతం ఆ తుపాన్‌ ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 520 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి 540 కిలోమీటర్లు, కాకినాడకు 620 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 720కిలోమీటర్లు, బాపట్లకు 790 కిలోమీటర్లు, అండమాన్ దీవుల్లోని శ్రీవిజయ పురానికి 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాను పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్నది. 26న తీవ్ర తుపాన్‌‌గా మారి 27న మరింత బలపడే అవకాశముంది. 28న ఉదయం సమయంలో బాపట్ల-విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో ఆ తీవ్ర తుపాన్‌ ‌తీరం దాటే సూచనలున్నాయి. తీరం దాటే సమయంలో 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ గాలుల వేగం అప్పుడప్పుడు గంటకు 140 కిలోమీటర్ల వరకు పెరగవచ్చు. ఉత్తరాంధ్రపై అర్నాబ్ తుఫాన్ ప్రభావముండే అవకాశముంది. తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు ఇప్పటికే మొదలయ్యాయి. మంగళ, బుధవారాల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చు. ఈ తుపాన్‌ ఎఫెక్ట్‌ ‌వల్ల మన రాష్ట్రంలో మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వానలు అక్కడక్కడా పడొచ్చు. బుధవారం నాడు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు 28న కురిసే అవకాశమున్న నేపథ్యంలో ఆ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌‌ను జారీ చేసింది. ఆ జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్