కారకాస్ : సుమారు పది నెలల పాటు ప్రవాస జీవితం గడిపిన వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడో ఆదివారం స్వదేశానికి చేరుకున్నారు. ఆమెకు గత సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి లభించిన విషయం తెలిసిందే. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా మచాడోపై ప్రభుత్వం పదిహేను సంవత్సరాల అనర్హత వేటు వేసింది. దీంతో ఆమె మద్దతుతో ఎడ్మండో గోంజలెజ్ ఉర్రుటియా ప్రతిపక్ష అభ్యర్థిగా పోటీ చేశారు. కాగా ప్రవాస జీవితం గడిపి వచ్చిన మచాడోకు రాజధాని కారకాస్‌లో ఆమె మద్దతుదారులు స్వాగతం పలికారు.
వెనిజులాకు తిరిగొచ్చిన మచాడో
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)