Magazines

పంజాబ్‌ 289/6

56 నిమిషాల క్రితం

Punjab 289/6
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

ప్రభుసిమ్రన్‌, సాలిల్‌, రమణ్‌‌దీప్‌ అర్థ సెంచరీలు

హైదరాబాద్‌‌తో రంజీ మ్యాచ్‌ ‌తొలి రోజు
నవతెలంగాణ-హైదరాబాద్‌ : రంజీ ట్రోఫీ మూడో రౌండ్లో హైదరాబాద్‌, పంజాబ్‌ ‌మ్యాచ్‌ ‌తొలి రోజు ఆసక్తికరంగా సాగింది. ఎర్ర మట్టి పిచ్‌‌పై 60 ఓవర్లలోపే ఐదు వికెట్లు పడగొట్టిన హైదరాబాద్‌.. ఆ తర్వాత వికెట్ల వేటలో నిరాశపరిచింది. టాస్‌ ‌నెగ్గి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌ ‌తొలి రోజు 90 ఓవర్లలో 6 వికెట్లకు 289 పరుగులు చేసింది. ఓపెనర్లు విహాన్‌ ‌మల్హోత్రా (12), హర్నూర్‌ ‌సింగ్‌ (17), ఉదయ్‌ ‌సహరాన్‌ (16)‌లు తొలి సెషన్లోనే అవుటైనా.. ప్రభుసిమ్రన్‌ ‌సింగ్‌ (81, 126 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌), సాలిల్‌ అరోరా (57 నాటౌట్‌, 143 బంతుల్లో 2 ఫోర్లు), రమణ్‌‌దీప్‌ ‌సింగ్‌ (52, 79 బంతుల్లో 6 ఫోర్లు) అర్థ సెంచరీలతో కదం తొక్కార. జషన్‌‌ప్రీత్‌ ‌సింగ్‌ (45, 84 బంతుల్లో 5 ఫోర్లు) విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. రమణ్‌‌దీప్‌ ‌సింగ్‌ ఆరంభంలో ఇచ్చిన క్యాచ్‌‌ను వికెట్‌ ‌కీపర్‌ ‌రాహుల్‌ ‌వదిలేయగా.. సాలిల్‌ అరోరాతో కలిసి రమణ్‌‌దీప్‌ ‌సింగ్‌ ఆరో వికెట్‌‌కు 93 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించాడు. పేసర్లు రక్షణ్‌ ‌రెడ్డి (2/53), సివి మిలింద్‌ (1/41), స్పిన్నర్లు తనయ్‌ ‌త్యాగరాజన్‌ (1/85), అనికెత్‌ ‌రెడ్డి (1/84) రాణించారు. పరుగుల వేట కష్టసాధ్యమైన జింఖానా గ్రౌండ్‌‌లో తొలి రోజే 289 పరుగులు చేసిన పంజాబ్‌.. నేడు భారీ స్కోరుపై గురిపెట్టింది. ఫామ్‌‌లో ఉన్న సాలిల్‌ అరోరా క్రీజులో ఉండటంతో నేడు మరో వంద పరుగులైనా జోడించే అవకాశం కనిపిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్