రిటెన్షన్ జాబితా గడువు నవంబర్ 15
నవతెలంగాణ-ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 సీజన్ మినీ ఆటగాళ్ల వేలం ఈ ఏడాది డిసెంబర్ 16న జరుగనుంది. ప్రాంఛైజీలు అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితా (రిటెన్షన్ లిస్ట్) సమర్పించేందుకు నవంబర్ 15 తుది గడువు కాగా.. ఆ గడువు ముగిసిన నెల రోజుల తర్వాత ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. ఐపీఎల్ 2027 ఆటగాళ్ల వేలం గోవాలా జరుగుతుందని బీసీసీఐ గతంలో ప్రకటించింది. డిసెంబర్ 16న బెంగళూరులో భారత్, శ్రీలంక వన్డే మ్యాచ్ ఉండగా, అదే రోజు మినీ వేలం షెడ్యూల్ చేశారు. మినీ వేలం ఒక్క రోజు మాత్రమే జరుగుతుంది. 2026 ఐపీఎల్ ముగిసిన నెల రోజుల తర్వాత ప్లేయర్ ట్రేడింగ్ ఆరంభం కాగా.. లక్నో సూపర్‌జెయింట్స్ నుంచి రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటిల్స్‌కు రాగా.. కుల్‌దీప్ యాదవ్ ఢిల్లీ నుంచి లక్నోకు వెళ్లాడు. సన్‌రైజర్స్ నుంచి లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారి ఢిల్లీకి రాగా.. టి నటరాజన్ క్యాపిటల్స్ నుంచి సన్‌రైజర్స్‌కు వెళ్లాడు. ప్లేయర్ ట్రేడింగ్ వేలానికి ఒక్క వారం ముందు వరకు చేసుకోవచ్చు. వేలం ముగిసిన తర్వాత సీజన్ ఆరంభానికి నెల రోజుల ముందు వరకు ట్రేడింగ్ అవకాశం ఉంటుంది.





కామెంట్‌లు (0)