Magazines

ఇది ప్రజాస్వామ్యమా? రాచరికమా?

1 గంట క్రితం

Is this a democracy? Or a monarchy?
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 3 నిమిషాల చదవడం

ఓటెవరు వేయాలనేది మీరెలా నిర్ణయిస్తారు?
రాజ్యాంగం కల్పించిన ఓటును తీసేసే హక్కు ఎవ్వరికీ లేదు

రాబోయే రోజుల్లో బీజేపీ పతనం ఖాయం

నవతెలంగాణ వర్క్‌‌షాపులో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని

ప్రజా ఉద్యమాలకు పత్రిక దిక్సూచిగా నిలవాలి : పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

‘ఇది ప్రజాస్వామ్యమా? రాచరికమా? ఓటు ఎవరు వేయాలని మీరెలా నిర్ణయిస్తారు? ఓటు ఉన్న భారతీయులు...ఓటు లేని భారతీయులు అని ప్రజల్ని చీల్చే హక్కు మీకెక్కడిది? రాజ్యాంగం కల్పించిన ఓటును తీసేసే హక్కు ఎవ్వరికీ లేదు. సర్‌‌కు వ్యతిరేకంగా ప్రజా తిరుగుబాట్లు ఉధృతమవుతున్నాయి. ఆ పోరాటాలను అణచివేయాలని మోడీ, అమిత్‌‌షా చూస్తున్నారు. కానీ, అది అసాధ్యం. నియంతృత్వంతో అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలన్న బీజేపీ ఆటలు ఇక సాగవు. రాబోయే రోజుల్లో బీజేపీ పతనం ఖాయం’ అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం హైదరాబాద్‌‌లో నవతెలంగాణ దినపత్రిక వర్క్‌‌షాపు జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా రూపొందించిన నవతెలంగాణ వెబ్‌‌సైట్‌‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం పత్రిక జీఎమ్‌ లింగారెడ్డి అధ్యక్షతన సభలో తమ్మినేని మాట్లాడుతూ..ప్రజల భావాలను ప్రతిబింబించేలా నవతెలంగాణ కథనాలు ఉండాలని ఆకాంక్షించారు. కమ్యూనిస్టు అజెండాతోనే దేశ భవిష్యత్తు అనే దానిమీద దేశంలో చర్చ జరగాలని ఆకాంక్షించారు. దేశంలో విద్యావ్యవస్థ మెరుగుపడాలి కమ్యూనిస్టులు ఎప్పటి నుంచో పోరాడుతున్నారనీ, ఇప్పుడు జెన్‌‌జీ ఉద్యమానికి కమ్యూనిస్టులు నాయకత్వం వహించకపోవచ్చుగానీ అది కమ్యూనిస్టు అజెండా నుంచే పుట్టిందని నొక్కి చెప్పారు. అయితే, విద్యామంత్రి రాజీనామా చేస్తే సరిపోదనీ, అందరికీ విద్య అందేలా వ్యవస్థ మారాలని ఆకాంక్షించారు. రైతులకు గిట్టుబాటు ధర కావాలనీ, కనీస మద్దతు ధరల చట్టం కావాలనే కమ్యూనిస్టుల అజెండా నుంచే ఢిల్లీ రైతాంగ పోరాటం నడిచిందని గుర్తుచేశారు.
Is this a democracy? Or a monarchy?ఆ రెండు పోరాటాల్లోనూ ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐకేఎస్‌ ‌పాత్రను విడమర్చి చెప్పారు. మూడు నల్లచట్టాల నుంచి వెనక్కి తగ్గేలా మోడీ మెడలు వంచినది రైతాంగ పోరాటమేనన్నారు. ఆనాడు కమ్యూనిస్టు భావజాలం కలిగిన రాజ్యాంగ పరిషత్‌ ‌సభ్యులు పట్టుబట్టడం వల్లనే రాజ్యాంగంలో లౌకికత్వాన్ని పొందుపర్చారని తెలిపారు. ఇప్పుడు ఆ విలువల రక్షణ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. దేశంలో 13 కోట్ల మంది ఓట్లను తొలగించడం చిన్నవిషయం కాదన్నారు. హిందూరాజ్యంగా మార్చే కుట్రలో భాగంగానే సర్‌ ‌ప్రక్రియ వచ్చిందని విమర్శించారు. దేశంలో ఓటులేని భారతీయులు, ఓటుఉన్న భారతీయులుగా ప్రజలు చీలిపోయే ప్రమాదముందనీ, వీరంతా తమ ఓటు హక్కు కోసం తిరగబడితే మోడీ సంగతి అంతేనని చెప్పారు. ప్రజాపోరాటాల్లో విధిగా సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈ ఉద్యమాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తే తమ ఉనికికే ప్రమాదమని భావించి మోడీ, అమిత్‌‌షాలు వాటిని అణచివేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ క్రమంలో భాగంగానే బీజేపీ అనుకూల శక్తులు సోషల్‌‌మీడియా వేదికగా ప్రజలను తప్పుదోవ పట్టించే అవాస్తవాలను పెద్ద ఎత్తున తెరపైకి తెస్తున్న తీరును ఉదహరణలతో వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో సమస్య, సమస్య వెనుక ఉన్న అంతర్జాతీయ పరిణామాలను జోడించి వార్తా కథనాలు రావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా ఆధిపత్యం తగ్గి భిన్నధ్రువాల ప్రపంచం వైపు అడుగులు పడుతున్నాయని తెలిపారు. ఇరాన్‌ ‌పోరాట పటిమతో అమెరికా దిక్కులేని పరిస్థితుల్లోకి కూరుకుపోయిందని చెప్పారు. డాలర్‌‌విలువ పడిపోతున్నదన్నారు. వేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిణామాలు కమ్యూనిస్టుల బలోపేతానికి దోహదపడుతున్నాయనీ, మన దేశంలోనూ కమ్యూనిస్టు భావజాల విస్తరణకు అనుకూల పరిస్థితులున్నాయని వివరించారు. కమ్యూనిస్టులపై జరుగుతున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. దేశంలో జరుగుతున్న వరుస పరిణామాలతో బీజేపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నదనీ, ఆ పార్టీ ఖతం కావడం ఖాయమని నొక్కి చెప్పారు. తెలంగాణలో ప్రజా సమస్యలను పరిష్కరించకుండా గాలికొదిలేసి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ‌పార్టీల నేతలు రాజకీయ, వ్యక్తిగత విమర్శలకు పూనుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

Is this a democracy? Or a monarchy?వర్క్‌‌షాప్‌‌లో నవతెలంగాణ దినపత్రిక వార్షిక నివేదికను సీజీఎమ్‌ పి.ప్రభాకర్‌ ‌ప్రవేశపెట్టారు. ఎడిటర్‌ ‌రాంపల్లి రమేశ్‌ ‌మాట్లాడుతూ...వృత్తినైపుణ్యాలు మెరుగుపర్చుకునేందుకు జర్నలిస్టులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన జర్నలిస్టులకు మెమెంటోలను జాన్‌‌వెస్లీ అందజేశారు. కార్యక్రమంలో నవతెలంగాణ బుక్‌‌హౌజ్‌ ఎడిటర్‌ కె.ఆనందాచారి, జీఎమ్‌‌లు ఎ.వెంకటేశ్‌, జి.రఘు, భరత్‌, వాసు, శశిధర్‌, నరేందర్‌‌రెడ్డి, రేణుక, ఉపేందర్‌‌రెడ్డి, పవన్‌, బోర్డు సభ్యులు జి. వేణుమాధవ్‌‌రావు, బీవీఎన్‌ ‌పద్మరాజు, కె.ఎన్‌.హరి, సలీమా, మోహన్‌‌కృష్ణ, అజయ్‌, తదితరులు పాల్గొన్నారు.

Is this a democracy? Or a monarchy?దిక్సూచిగా నిలవాలి

ప్రజా ఉద్యమాలకు నవతెలంగాణ పత్రిక దిక్సూచిగా నిలవాలనీ, ఉద్యమాలను ముందుకు నడిపే గొంతుకగా నిలవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ ఆకాంక్షించారు. వర్క్‌‌షాప్‌ ‌ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రామిక వర్గాలపక్షాల నిలబడి వారి హక్కుల కోసం జరుగుతున్న పోరాటాలను సమాజానికి చూపెడుతున్న పత్రిక నవతెలంగాణ అని చెప్పారు. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా లౌకిక విలువలను కాపాడే దిశగా నవతెలంగాణ ప్రయాణం సాగాలన్నారు. బీఆర్‌ఎస్‌ అడుగు జాడల్లోనే కాంగ్రెస్‌ ‌పాలన నడుస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఎత్తిచూపారు. ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ ‌పట్టభద్రుల నియోజకవర్గ స్థానంలో ప్రజా సంఘాల అభ్యర్థిని నిలబెట్టబోతున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్‌-‌రంగారెడ్డి-మహబూబ్‌‌నగర్‌ ‌పట్టభద్రుల స్థానంలో అభ్యర్థిని నిలపడంపై వామపక్షాలతో, ప్రజా సంఘాలతో చర్చిస్తున్నామనీ, అది కుదరకపోతే బీజేపీని ఓడించే అభ్యర్థికి అక్కడ మద్దతునిస్తామని తెలిపారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్రోత్సహించేలా నవతెలంగాణ కథనాలు ఉండాలని ఆకాంక్షించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్